అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
ఙ్ఞానవైరాగ్య సిద్ద్యర్థం బిక్షాం దేహిచ పార్వతి |
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
భాందవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం ||
భగవత్ భక్తులకి మనవి దేవాలయము ప్రాంగణము లో భుజించే అన్నము భగవంతుని ప్రసాదము తో సమానము అటువంటి అన్నముని పది మందికి అందించే గొప్ప అవకాశము భగవంతుని కృప మన మీద ఉంటే ఆ అవకాశం కలుగుతుంది.
సాక్షాత్తు ఆ శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీత లో అన్నము విశిష్ఠత నీ గురించి వివరించారు ..
శ్లోకం::::
అన్నద్భావంతి భూతాని
పర్జన్యాదన్న సంభవః. |
యజ్ఞాధ్భవంతి పర్జన్యో
యజ్ఞః కర్మ సముద్భవ : ||
భావం:::
సమస్త ప్రాణులు అన్నము నుండి పుడుతున్నాయి .అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది ..వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది...యజ్ఞం సత్కర్మ వలన కలుగుతుంది...అంతటి గొప్పది అన్నప్రసాదం
""""నవ్వు పదిమందికి అన్నం అందిస్తే
ఆ పరమాత్మ నీ వెంట ఉంటాడు """
YOU ARE WHAT YOU EAT
మనం ఎటువంటి భావనతో ఆహారం భుజిస్తామో
అటువంటి మనస్సు కలిగి వృద్ధి పొందుతాము...
శ్రీ రామ యోగేంద్ర స్వామి వారు - అన్నదానం
అనంత పుణ్యము లని అందించే అన్నప్రసాద వితరణ గురించి సాక్షాత్తు భగవత్ స్వరూపులు శ్రీ రామయోగేంద్ర స్వామి వారు నిరంతరం శిష్య కోటి కి వివరించే వారు
రామనామం అన్నదానం జరిగిన చోట దేవతలు సంచరిస్తారు
వారు రామ నామం, అన్నదానం జరిపిన ప్రతి గ్రామం నేడు అఖండ సిరి సంపదలతో, అక్షయం గా విలసిల్లుతోంది..
వారి బాట లోనే దివ్యశ్రీ చిన రామయోగేంద్ర స్వామి వారు కూడా నిరంతరం మన ఆశ్రమం లో అన్నప్రసాద వితరణ చేయిస్తూ ఉండేవారు...
వారు “అన్నపూర్ణా కావడి” ద్వారా నిత్యాన్నదానం జరిపిస్తూ ఉండేవారు. ప్రస్తుతం వారి యొక్క భావాలను అణువణువునా ఆచరిస్తూ సాగుతున్న “శ్రీ రామ యోగేంద్ర స్వామి వారి ఆశ్రమం“ వారి బాటలోనే అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించుట కొరకు “శ్రీ కాత్యాయిని జీవన్ముక్తేశ్వర సాయి రామ యోగేంద్ర హనుమత్ అన్నపూర్ణేశ్వరి నిత్య అన్న దాన ట్రస్ట్” ను 2024వ సం.లో ఏర్పాటు చేసుకోవడమైనది.
ఆ గురుదేవులు చూపిన బాటలోనే మన మేడూరు గ్రామములొ అశేష అన్నప్రసాద కార్యక్రమాలు జరిగి కొన్ని లక్షల మండి అన్న ప్రసాద వితరణలో పాల్గొని ధన్యులయ్యారు. అటువంటి అన్న ప్రసాద్ వితరణలో భక్తులందరూ పాల్గొని సహకరించాలని ప్రార్ధన.
గమనిక :-
1) ఒకరోజు భక్తుల పేరుమీదుగా అన్నదానం జరుపుటకు విరాళము – రు.3,116/-లు
2) శాశ్వత అన్నదాన నిధి విరాళము – రు.1,00,116 /- లు
3) అన్నదానమునకు భక్తులు ధన, ధాన్య, వాస్తు రూపేణా కూడా విరాళము ఎంతైనా ట్రస్ట్ కు అందించ వచ్చును.
విరాళాలు పంపవలసిన అకౌంట్ నెంబర్ వివరాలు
- Account Name : Sri K J S R H A N A TRUST MEDURU
- A/c.No. 212311010000034
- IFSC Code : UBIN 0821233
- Bank Name : Union Bank of India
- Branch : PEDAKOMIRA – THOTAMOOLA.
విరాళాలు పంపవలసిన అకౌంట్ నెంబర్ వివరాలు(తెలుగులో)
- అకౌంట్ పేరు : Sri K J S R H A N A TRUST MEDURU
- అకౌంట్ నెంబర్: 212311010000034
- IFSC Code : UBIN 0821233
- బ్యాంక్ పేరు : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- బ్రాంచి : పెద కొమిర - తోటమూల
వివరములకు సంప్రదించ వలసిన ఫోన్ నంబర్స్:
- ఛైర్మన్ - శ్రీ జ్యేష్ట అప్పారావు గారు సెల్: 9908916650
- సెక్రెటరీ - శ్రీ బాసాటి వెంకటేశ్వర్లు గారు సెల్ : 7382123543
- కోశాధికారి - శ్రీ కుందా వెంకటేశ్వర్లు గారు సెల్: 9290174535
"ఇట్లు"
ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త
శ్రీ గుంటూరు హనుమత్ శర్మ గారు
సెల్ : 9949409302, 9491695983
Blessed are those who share their meals with others -RAMAYOGI